728x90 AdSpace

  • Latest News

    Powered by Blogger.
    Friday 19 June 2015

    కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ రివ్యూ


    రామలక్ష్మి సినీ క్రియేషన్స్
    నిర్మాత : లగడపాటి శ్రీధర్
    దర్శకత్వం : ఆర్. చంద్రు
    సంగీతం : హరి
    నటీనటులు : సుధీర్ బాబు, నందిత తదితరులు
    విడుదల : 19 - 06 - 2015
    రేటింగ్ : 2. 25 / 5




    Review

    ప్రేమకథ చిత్రం తో మంచి విజయాన్ని అందుకోవడమే కాకుండా హిట్ పైయిర్ గా మంచి క్రేజ్ తెచ్చుకున్నారు హీరో సుదీర్ బాబు , నందిత. అలంటి క్రేజీ కలయికలో రూపొందిన మరో చిత్రం కృష్ణమ్మా కలిపింది ఇద్దరినీ. కన్నడలో సూపర్ డూపర్ హిట్ అయిన చార్మినార్ చిత్రానికి రిమేక్ గా రూపొందిన ఈ చిత్రం అచ్చమైన ప్రేమ కథగా తెరకెక్కింది. కన్నడ దర్శకుడు అర్ చంద్రు దర్శకత్వం లో కృష్ణమ్మా కలిపింది ఇద్దరినీ పేరుతొ ప్రముఖ నిర్మాత లగడపాటి శ్రీధర్ నిర్మించిన ఈ చిత్రం ఈ రోజు విడుదల అయింది. మరి ఈ కృష్ణమ్మా ఎవరిని ఎలా కలిపిందో చూడాలంటే కథలోని వెళ్ళాల్సిందే

    కథ :


    అమెరికాలోని ఓ పెద్ద కంపెనీకి సీఇఓగా పనిచేసే కృష్ణ (సుధీర్ బాబు), తాను చదివిన స్కూల్‌ గెట్ టుగెదర్ ఫంక్షన్ లో పాల్గొనడానికి తన సొంత ఊరు కృష్ణాపురానికి బయలుదేరడంతో సినిమా మొదలవుతుంది. హైదరాబాద్ లో దిగి కృష్ణాపురానికి అయన ప్రయాణం మొదలవ్వగానే కృష్ణకు బాగా గుర్తొచ్చే వ్యక్తి రాధ (నందిత). కృష్ణా నది పరిసర ప్రాంతంలోని ఓ చిన్న ఊర్లో ఓ దిగువ మధ్య తరగతి కుటుంబంలో పుట్టిన కృష్ణ, స్కూల్లో తనతో పాటే చదివే రాధను ప్రేమిస్తాడు. ఇంటర్‌లో కూడా కృష్ణ, రాధ ఒకే కాలేజ్‌లో చేరతారు. అక్కడే రాధను కృష్ణ మరింత ఎక్కువగా ప్రేమించడం మొదలుపెడతాడు. రాధకు తన ప్రేమను ఎలాగైనా వ్యక్తపరచాలని కృష్ణ చాలా ప్రయత్నాలు చేస్తాడు. ఈ క్రమంలోనే రాధకు ప్రేమపై ఎటువంటి ఆసక్తి లేదని తెలుసుకుంటాడు. ఆ తర్వాత కృష్ణ హైద్రాబాద్‌లో ఇంజనీరింగ్ చదువుకు వెళ్ళిపోవడం, హైద్రాబాద్‌లో రాధ-కృష్ణలు మళ్ళీ కలవడం, కొన్ని కారణాల చేత మళ్ళీ విడిపోవడం, కృష్ణ బాగా చదువుకొని మంచి ఉద్యోగం సంపాదించడం.. ఇలా జరుగుతున్నా క్రమం లో చివరకు కృష్ణ-రాధల ప్రేమకథ ఎక్కడ తేలింది? వారిద్దరి ప్రేమకు ఎవరు అడ్డుపడ్డారు? కృష్ణమ్మ(నది) వారిద్దరినీ ఎలా కలిపింది? అన్న ప్రశ్నలకు సమాధానమే తెలియాలంటే మాత్రం సినిమా చూడాల్సిందే.

    నటీనటుల ప్రతిభ :


    కథ మూడు వయసుల్లో జరుగుతుంది. చిన్నప్పుడు, ఇంటర్ కాలేజీ చదివే రోజుల్లో, ఇంజనీరింగ్ చదివే రోజుల్లో.. ఇలా ఒక్కో దశలో కృష్ణ ప్రేమలోని ఎమోషన్ మారుతూ ఉండడాన్ని చాలా బాగా చూపించాడు. ప్రేమకథల్లో ఎక్కువగా కనిపించే అంశాలు బాగున్నాయి. ఒక ఎదిగే కుర్రాడి జీవితంలో కలిగే తల్లి, తండ్రి, గురువు, ప్రేమ మరియు లక్ష్య సాధన అనే పాయింట్స్ ని చాలా బాగా చెప్పాడు. కృష్ణగా సుధీర్ బాబు చాలా బాగా నటించాడు. ఇప్పటివరకూ ఆయన చేసిన సినిమాలన్నింటిలోకెల్లా ఈ సినిమాలోని యాక్టింగ్‌ ది బెస్ట్‌ అని చెప్పవచ్చు. ఈ క్యారెక్టర్‌లోని మూడు వేరియేషన్లను పర్ఫెక్ట్ గా చూపించాడు. ముఖ్యంగా కృష్ణ పాత్రలో ప్రతి దశలో వచ్చే ఎమోషన్స్ ని సుధీర్ బాబు చాలా బాగా చూపించాడు. కాని కొన్ని సన్నివేశాల్లో ఆకట్టుకోలేక పోయాడు. కొన్ని సీన్స్ లో కంటతడి పెట్టించాడు. ఇక నందిత తన పాత్రలో ఒదిగిపోయి నటించింది. క్లైమాక్స్‌లో వీరిద్దరి యాక్టింగ్ కట్టిపడేస్తుంది. సుధీర్ బాబు, నందితల కెమిస్ట్రీ బాగుంది. చివర్లో వచ్చే క్లైమాక్స్‌తో ఇటు టైటిల్‌కు, అటు ప్రేమకథకు సరైన న్యాయం చేశారు. పోసాని కృష్ణ మురళి చేసిన సీన్స్ హైలెట్ గా నిలిచాయి.

    సాంకేతిక విభాగం :


    ఇక్కడ ముందుగా దర్శకుడు ఆర్. చంద్రు గురించి చెప్పుకోవాలి. ఒక ఫార్ములా కథనే ఆసక్తికరంగా మలిచే ప్రయత్నంలో చాలా వరకు విజయం సాధించాడు. స్క్రీన్‌ప్లే బాగుంది. సినిమా మొదట్లో మొదలైన సస్పెన్స్ ఎలిమెంట్‌ను చివరివరకూ బాగా క్యారీ చేశాడు. కానీ కథను చెప్పే విషయం లో ఇంకాస్త కేర్ తీసుకొని ఉండాల్సింది. సినిమాటోగ్రఫీ చాలా బాగుంది. ఒక్కో దశలో మారుతూ ఉన్న ఎమోషన్స్‌ను సినిమాటోగ్రాఫర్ బాగా ప్రజెంట్ చేసాడు. హరి అందించిన సంగీతం బాగుంది. పాటలు వినడానికి బాగున్నాయి, కానీ సినిమాలో అసందర్భంగా రావడంతో, అవి వృథా అయినట్టు కనిపిస్తుంది. నేపధ్య సంగీతం సినిమాకి ప్రాణం పోసిందని చెప్పాలి. ఎడిటింగ్ ఫర్వాలేదనేలా ఉంది. ప్రొడక్షన్ వ్యాల్యూస్ కుడా బాగున్నాయి.

    విశ్లేషణ :


    ఈ సినిమాలో ముక్యంగా చెప్పుకోవలసింది కొన్ని అనవసర సన్నివేశాలు , పాటలు . వినడానికి చూడటానికి పాటలు బాగున్నాయి కానీ అవి వచ్చే సందర్భం బాగా లేదు. రెగ్యులర్ ఫార్ములా ప్రేమకథనే ఎంచుకున్నా, స్క్రీన్‌ప్లేలోని కొన్ని గ్రిప్పింగ్ పాయింట్లతో ఆసక్తికరంగా చెప్పడానికి ట్రై చేసారు. కానీ ఈ పాటలు ప్రేక్షకుడిని డిస్టర్బ్ చేస్తాయి. వీటి వలన సినిమాలో సీన్ కి సీన్ కి మధ్య కనెక్టివిటీ మిస్ అవుతుంది. కాలేజీ నేపథ్యంలో వచ్చే కొన్ని సన్నివేశాలు, మరో లేడీ లవ్ ట్రాక్ అవసరం లేదు. అలాగే చైతన్య కృష్ణ పాత్రకి పెద్ద ప్రాముఖ్యత లేదు. ఏదో కథని ఇంకాస్త పెంచాలి అన్న ధోరణి లో సాగుతుంది. సినిమా మొదటి నుంచి చివరి వరకూ నెరేషన్ చాలా స్లోగా ఉంటుంది, అందులోనూ ఇంటర్వెల్ తర్వాత కొద్దిసేపు మరీ నెమ్మదిగా నడుస్తుంది. అలాగే సినిమాలో నందిత సైడ్ నుంచి ఒక్కసారి కూడా కృష్ణ మీద లవ్ ఉందని చూపించకుండా ఇద్దరినీ కలపడంలో ఉన్న అసలు లాజిక్ ను మిస్ అయ్యాడు దర్శకుడు. నిజమైన ప్రేమని, ఆ భావాలని పర్ఫెక్ట్ గా చూపించగలిగే సినిమాలన్నీ ఎప్పుడూ కొత్తగానే కనిపిస్తాయ్! ఆ కోవలోకె ఈ సినిమా వస్తుంది. కాని కొన్ని ఎమోషనల్ సీన్స్ ఈ సినిమాకు అనుకూలించే అంశాలు. ఇక కొన్ని అసందర్భంగా వచ్చే పాటలు, అనవసర సన్నివేశాలు, స్లో నెరేషన్ ఈ సినిమాకు ఇబ్బందిగా మారిన అంశాలు. మొత్తంగా సినిమాలో ఫీల్ ఉన్న ప్రేమకథకు జీవం లేనట్టయింది .

    పంచ్ లైన్ : ఫీల్ ఉన్నా జీవం లేదు

    • Blogger Comments
    • Facebook Comments

    0 comments:

    Post a Comment

    Item Reviewed: కృష్ణమ్మ కలిపింది ఇద్దరినీ రివ్యూ Rating: 5 Reviewed By: Sudeep
    Scroll to Top